TECHNOLOGY

తమిళ డైరెక్టర్ కు రెండో చాన్స్ ఇచ్చిన ప్రభాస్?

ఇటు సౌత్ అటు నార్త్ లో ప్రభాస్ కు మంచి మార్కెట్ ఏర్పడింది. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి, బాహుబలి 2 వంటి చిత్రాల్లో నటించడం ప్రభాస్ కు కలిసొచ్చింది. దీంతో ప్రభాస్ అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలకు సుపరిచితుడయ్యాడు. తర్వాత మూవీ ఎవరితో చేస్తాడనుకుంటున్న సమయంలో యూవీ క్రియేషన్స్ వారి బ్యానర్ లో సాహో లాంటి మాఫియా బ్యాక్ గ్రౌండ్ ఉన్న కథతో వచ్చి నిరాశపరిచినా, బాలీవుడ్ పరిశ్రమలో సినిమా హిట్ గా నిలిచింది. ప్రభాస్ తన తర్వాత మూవీ ఏ డైరెక్టర్ తో చేస్తాడోనని సగటు అభిమాని ఎదురుచూస్తుండగా రాధేశ్యామ్ మూవీని చేస్తున్నట్లు అనౌన్స్ మెంట్ చేశాడు ఈ యంగ్ రెబల్ స్టార్. దీనికి  రాధాకృష్ణ కుమార్ డైరెక్టర్. నెక్ట్స్ మూవీ సలార్ అంటూ యాక్షన్ ఫ్రేమ్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేసి సినీ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యంలో ముంచాడు ఈ బాహుబలి.

ఈ చిత్రానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆయన కేజీఎఫ్ తో పేరును గడిచాడు. కేజీఎఫ్ చాప్టర్ 2  మూవీ చిత్రీకరణ పూర్తికావడంతో సలార్ షూట్ లో ఉన్నాడు. అయితే సలార్ చిత్రీకరణ రెండు షెడ్యూళ్లు పూర్తయ్యింది. మూడో షెడ్యూల్ త్వరలో ప్రారంభకాబోతోంది. అయితే సలార్ షూటింగ్ దశలో ఉండగానే గాసిప్ వినిపిస్తున్నది. ప్రభాస్ తన తర్వాత చేయబోయే ప్రాజెక్టు కూడా ప్రశాంత్ నీల్ తో ఉండనుందట. అయితే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని అప్డేట్ సమాచారం. దీనిపై డైరెక్టర్, ప్రభాస్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button