TECHNOLOGY
Trending

జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో పేలుళ్లు

జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ టెక్నికల్ ఏరియా లోపల ట్విన్ (రెండు) బ్లాస్ట్ లు జరిగాయి. ఐఎఎఫ్ స్టేషన్ పై ఉగ్రవాదులు దాడులు చేశారని జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ తెలిపారు. ఆదివారం తెల్లవారు జామున ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. డ్రోన్లను ఉపయోగించి ఈ పేలుళ్లకు పాల్పడినట్లు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ప్రతినిధులు  భావిస్తున్నారు.  ఈ దాడుల వెనుక ఉగ్రవాదుల ఉద్దేశం ఏమై ఉంటుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి ఉగ్రవాద వ్యతిరేక సంస్థ, నేషనల్ ఇన్వేష్టిగేషన్ ఏజెన్సీ అధికారులు చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button