TECHNOLOGY

‘చిరంజీవి’ చేతులమీదుగా ‘విరాటపర్వం’ టీజర్ రిలీజ్.. ఫుల్ జోష్ లో రానా, ఓ బడా నిర్మాత ?

విరాట పర్వం టీజర్ ల్యాంచ్ విషయంలో ఇటు ప్రజలు అటు సినీ పరిశ్రమల్లో బాగా హైప్ క్రియేటయ్యింది. సామాజిక మాధ్యమాల్లో గురువారం ఉదయమే మెగాస్టార్ చిరంజీవి చేతులమీదగా ఈరోజు సాయంత్రం 5.04 నిమిషాలకు లాంచింగ్ ఉంటుందని చెప్పడంతో మెగా అభిమానులు, రానా ఫ్యాన్స్, సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అనుకున్న సమయానికి విరాటపర్వం టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. టీజర్ లో రానా స్ర్కీన్ పై కని.. కనిపించగానే.. ‘‘ ఆదిపత్య జాడలనే చెరిపేయగ ఎన్నినాళ్లు.. తారతమ్య గొడలనే పేకిలించగ ఎన్నినాళ్లు.. అంటూ డైలాగుతో మొదలైంది. తర్వాత సీన్ లో సాయిపల్లవి తన ప్రేమ గురించి వాయిస్ ఓవర్ ఇస్తుండగా.. అందులో రానా పాత్ర పేరు అరణ్య అని తెలుస్తున్నది. ఆ తర్వాతి సీన్ లో ఆరడుగుల రానా కనిపించడం ఆపై పోలీసులకు, అన్నలకు మాధ్య కాల్పులు చోటుచేసుకోవడం గమనిస్తే.. విరాటపర్వం మూవీపై అంచనాను పెంచుతున్నది.  ఇక యాక్షన్ సీన్ లు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేటట్లు ఉంటాయని తెలుస్తోంది.

నేనున్నానంటూ… చిరు

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నబిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ లో పాల్గొని, కంటెస్టంట్లకు వరాల జల్లు కురిపించారు. నిన్న నటుడు శర్వానంద్ కు..   శ్రీకారం మూవీ విషయంలో ఆశీర్వదించారు. తాజాగా మూవీ మోఘల్  రామానాయుడు మనువడు, బాహుబలి భల్లాలదేవుడు రానా హీరోగా నటించిన విరాటపర్వం టీజర్ రిలీజ్ చేసి శుభాసీసులు అందించారు మెగాస్టార్.

ఏప్రిల్ 30న విరాటపర్వం.. ఈనెల 26న అరణ్య ..రిలీజ్..

ఇక విరాటపర్వంలో ప్రియమణి, సాయిపల్లవి, నవీన్ చంద్ర, నందితా దాస్, నివేథా పోతురాజు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఇక రానా గురించి.. ఆయన నటించిన విరాటపర్వం ఏప్రిల్ 30న విడుదల కానుంది. అలాగే ఆయన మరోక చిత్రం అరణ్య.. కూడా  ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్ ది బెస్ట్ టు ది రానా. సినిమాను సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణ గావిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button