TECHNOLOGY

కేరళను హడలెత్తిస్తున్న జికా వైరస్

ఎడాపెడా వైరస్ లు మనల్ని చుట్టుముట్టయా? కరోనా తర్వాత బ్లాక్ ఫంగస్ పేరు వింటే హడలిపోతున్నారు జనం. దీనికి తోడన్నట్లు డెల్టా వైరస్ ఒకటి. ఈ వైరస్ లతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుజీవుడా అంటూ సాగిపోతున్నారు. అలాంటి వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది మరొక వైరస్. కేరళ రాష్ర్టంలోని తిరువనంతపురం జిల్లాలో కొత్త కేసులు నమోదయ్యాయి.  అక్కడి ప్రజలను, ప్రభుత్వాన్ని నిద్రలేకుండా చేస్తున్నది జికా వైరస్. మీరు విన్నది కరెక్టే జికా వైరస్. తిరువనంతపురంలో 13 మందికి చెందిన బ్లడ్ శాంపిల్స్ ను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పుణె ల్యాబ్ కు పంపగా, పాజిటివ్ గా నిర్థారణైంది.  సో మన ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడాల్సిందే. అసలు విషయం చెప్పలేదు కదూ.. జికా వైరస్ ఈడెస్ దోమ మూలాన సోకుతుంది. అది కుడితే జికా వైరస్ బారిన పడడమే. అంతర్జాలంలో దొరికిన అంశాల ఆధారంగా ఈ సమాచారం మీ ముందుకు తీసుకొచ్చాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button