TECHNOLOGY
కుమారుడు ఆర్యన్ ఖాన్ తో మాట్లాడిన షారుఖ్ ఖాన్

ఆర్యన్ ఖాన్ అతడి కుటుంబం నుంచి ఈ వారం తాలూకా మనిఆర్డర్ రూ.4,500లను స్వీకరించాడు. నగదును భోజన ఇతర ఖర్చుల నిమిత్తం వినియోగించుకోనున్నాడు. ఆర్యన్ తో అతడి కుటుంబం నుంచి వారానికి రెండుసార్లు పది నిమిషాలపాటు వీడియో కాల్ స్వీకరించడానికి హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆ మేరకు షారుక్ ఖాన్, గౌరీ దంపతులు సోమవారం వీడియోకాల్ చేసి మాట్లాడారు. అదే రోజు మని ఆర్డర్ కూడా తీసుకున్నాడు. డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన ఆర్యన్ కు బెయిల్ ను హైకోర్టు నిరాకరించడం తెలిసిందే. ఆర్యన్ కు ఆర్థూర్ జైలులో అండర్ ట్రయల్ నెంబర్ ఎన్ 956 ను కేటాయించారు. ఆర్యన్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్న తర్వాత ఇప్పటి వరకు షారుక్ ఖాన్ దంపతులు స్పందించకపోవడం విశేషం.