TECHNOLOGY

ఐపీఎల్ 2021 : తాజా షెడ్యూల్ ఇదే..

క్రికెట్ ప్రియులకు సందడే సందడి

ఇండియాలో అమిత ఆదరణ పొందిన పొట్టి ఫార్మెట్ క్రికెట్ అయిన ఐపీఎల్ 2021 తాజా షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించిన వివరాలను బీసీసీఐ ఆదివారం తెలిపింది. అయితే రెండేళ్ల తర్వాత సొంత గడ్డపై ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి.  ఏప్రిల్ 9న  ప్రారంభమయ్యే ఐపీఎల్ తొలిమ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి, రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ ఐపీఎల్ 2021 ఏప్రిల్ 9న ప్రారంభమై.. మే 30తో ముగుస్తున్నది. ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్ లో ఉన్న మోతేరాలో ఐపీఎల్ ఫైనల్ జరుగనుంది. మొత్తం లీగ్ మ్యాచ్లు 56 జరుగుతున్నాయి. చెన్నై, ముంబయి, కొల్ కతా, బెంగళూరుల్లో ఒక్కో ప్రాంతంలో పది మ్యాచ్లు జరుగనున్నాయి. అహ్మదాబాద్, ఢిల్లీల్లో ఒక్కొక్క చోటా ఎనిమిది మ్యాచ్లు జరుగనున్నాయి. భారత కాలం మానం ప్రకారం.. మ్యాచ్లు సాయంత్రం 3.30 గంటలకు, 7.30 గంటలకు ప్రసారమవ్వనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button