TECHNOLOGY

ఏపీ మున్సిపల్, కార్పొరేషన్ ఫలితాలు : ఫ్యాన్ దే హవా

11 కార్పొరేషన్లు వైసీపీవే

హైకోర్టు ఆదేశాలతో ఏలూరు నగరపాలక సంస్థ ఫలితాల నిలిపివేత

ఆంధ్రప్రదేశ్లో ఈనెల 10న జరిగిన 71 మున్సిపాల్టీలు, 12 నగర పాలక సంస్థల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఫ్యాన్ హవానే నడిచింది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించింది. 12 నగరపాలక సంస్థల్లో పదకొండింటిలో వైసీపీదే జయకేతనం. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, విజయనగరం, విశాఖపట్నం, మచిలీపట్నం నగరపాలక సంస్థల్లో విజయఢంకాను ఫ్యాన్ గుర్తు పార్టీ మోగించింది.

అయితే హైకోర్టు ఆదేశాలతో ఏలూరు నగరపాలక సంస్థ ఫలితాలను వెల్లడించలేదు. గుంటూరు, విజయవాడల్లో చంద్రబాబు ప్రచారంలో పాల్గొని రాజకీయం వేడెక్కించినా గానీ ఆ రెండు వైసీపీ ఖాతాలోకే వెళ్లడం విశేషం. విజయవాడలో 64 డివిజన్లలో వైసీపీ 49, టీడీపీ 14, సీపీఎం ఒక చోట గెలుపొందింది. గుంటూరులోని 57 డివిజన్ లో ఒక డివిజన్ ఏకగ్రీవం కాగా, మిగతా స్థానాల్లో వైసీపీ 43, టీడీపీ 9, జనసేన 2, ఇతరులు రెండు స్థానాల్లో గెలిచారు.

విజయవాడ, గుంటూరు … అమరావతి రాజధాని పరిధిలో ఉన్న ప్రాంతాలు కావడంతో వాటిపై భారీగానే బెట్టింగులు జరిగాయన్నది బహిరంగ రహస్యమేనని పలువురు అంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button