Entertainment
Trending

ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆర్ ఆర్ ఆర్ ప్రస్థానం మొదలు

roar-of-rrr-making-video-to-release-today
roar-of-rrr-making-video-to-release-today

“ఆర్ఆర్ఆర్” సినిమాకి సంబంధించి షూటింగ్ క్లైమాక్స్ కి  చేరుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు ఫిల్మ్ నగర్ టాక్. త్వరలోనే ఆ సాంగ్ యూరప్ లో చిత్రీకరించనున్నట్లు ఈ సాంగ్ లో ఎన్టీఆర్ ఒలివా మోరిస్ పాల్గొననున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి మధ్య ఉండే ఈ సాంగ్ కూడా షూట్ చేస్తే రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి శ్రీకారం చుట్టినట్లే. బాహుబలి తర్వాత.. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఎన్టీఆర్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి వార్త అయినా ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ గా మారుతూ ఉండటం మాత్రమే కాక అనేక రికార్డులు సృష్టిస్తూ ఉన్నాయి. చరణ్, ఎన్టీఆర్ లుక్ కి సంబంధించిన టీజర్ లు.. ఇప్పటికే నందమూరి మెగా అభిమానులకు ఉర్రూతలూగేలా చేస్తున్నాయి.

‘రోర్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌’ పేరుతో మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేస్తున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. చరణ్, ఎన్టీఆర్ లకు సంబంధించిన షూటింగ్ సన్నివేశాలు ఈ వీడియోని .. ఈ రోజు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లో రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 13వ తారీఖున ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయింది. చరణ్, ఎన్టీఆర్ ల తో పాటు హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్‌.. బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ నటిస్తోంది. అంత మాత్రమే కాక అజయ్ దేవగన్ శ్రేయ కూడా కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పటివరకూ హీరోల సెపరేట్ టీజర్లు చూసిన మనకి మేకింగ్ వీడియోతో ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ ని పరిచయం చేసి, యుట్యూబ్ లో దాని ప్రస్థానం మొదలుపెట్టడానికి జక్కన్న సిద్దంగా ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button