TECHNOLOGY
ఇండియా వర్సెస్ శ్రీలంక : నేటి నుంచే టీ20 సమరం

శ్రీలంకపై వన్డే సిరీస్ గెలుచుకున్న ఇండియా రెట్టింపైనా ఉత్సాహంతో టీ 20 ఆడనుంది. ఆదివారం తొలి టీ20 జరగబోతోంది. ఈ టీ20 టీంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి తుదిజట్టులో చోటు దక్కనుందని తెలుస్తోంది. వరుణ్ చక్రవర్తిని తొలి టీ20లో ఆడించాలని కోచ్ రాహుల్ ద్రావిడ్ భావిస్తున్నారు. ఆఫ్ బ్రేక్ బౌలర్ కావడం, ఆపై క్యారమ్ బాల్స్ వేయగల సత్తా అతడిలో ఉందని ద్రావిడ్ నమ్ముతున్నారు. గాయాల కారణంగా గడచిన ఆస్ర్టేలియా, ఇంగ్లాండ్ సిరీస్ లకు దూరమయ్యాడు. సిరీస్ లో ఆడి సత్తా చాటాలని వరుణ్ భావిస్తున్నట్టు సమాచారం. శ్రీలంకతో నేడు జరిగే తొలి టీ 20 మ్యాచ్ రాత్రి 8 గంటలకు మొదలుకానుంది. రాబోయే టీ20 వరల్డ్ కప్ జట్టులో ఆఫ్ స్పిన్నర్‌గా చక్రవర్తికి చోటుదక్కే అవకాశం ఉంది.

