TECHNOLOGY

ఇండియన్ శాటిలైట్ మెన్ కు.. సలాం..

భారత ప్రొఫెసర్, శాస్ర్త వేత్త ఉడిపి రామచంద్రారావు 89వ జయంతిని గూగుల్ వారు ఘనంగా జరిపారు. ఇండియన్ శాటిలైట్ మెన్ గా ఉడిపి రామచంద్రారావుకు పేరున్నది. రావు 1975లో  ఇస్రో చైర్మన్ గా ఉన్న సమయంలో భారత మొట్టమొదటి శాటిలైట్ ‘ఆర్యభట్ట’ను విజయవంతంగా గగనతలంలోకి పంపారు.  1932లో కర్నాటకలోని ఒక గ్రామంలో రావు జన్మించారు.  కస్మిక్ రే భౌతిక శాస్త్రవేత్తగా తన జీవితాన్ని రావు ప్రారంభించారు. తథనంతరం స్పేస్ ప్రోగ్రాంకు ఇండియాస్ ఫాదర్గా గుర్తింపుపొందారు. అయితే డాక్టరేట్ పొందిన తర్వాత యూఎస్ కు వెళ్లారు. అక్కడ ఆయన ప్రొఫెసర్గా పనిచేశారు. తర్వాత నాసా స్పెస్ సమస్యలపై పరిశోధనలు చేశారు. 1966లో భారత్ కు తిరుగొచ్చి ఇండియా ప్రిమియర్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్పెస్ సైన్స్లో హై ఎనర్జీ.. ప్రోగ్రాంను ప్రారంభించారు. దేశ ఉపగ్రహ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ప్రొఫెసర్ రావు, దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్‌గా ఉండి అంతరిక్ష పరిశోధనలను ముందుకు తీసుకెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button