TECHNOLOGY

ఇండియన్ పేసర్ బుమ్రా వివాహం ఆమెతోనే.. ఇంతకి ఎవరామె?

భారత క్రికెట్ లో అనామకుడిగా వచ్చి అద్భుతాలు చేసిన టీమిండియా బౌలర్ బుమ్రా విహహం… ఒక చానెల్లో వ్యాఖ్యాతగా ఉన్న సంజనా గణేశన్ తో అతికొద్దిమంది ప్రముఖుల సమక్షంలో గోవాలో మంగళవారం ఘనంగా జరిగింది. ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లి ఫొటో పోస్టు చేసి అభిమానులను సంభ్రమాశ్చర్యంలో ముంచారు బుమ్రా దంపతులు. అందులో వారు ‘‘ ప్రేమ ఎలా గురించి వివరించి, ఈ రోజు  మా జీవితంలో మరపురాని రాజు. మీ అందరీ ఆశీసులు  కోసం మా వివాహ సమాచారం మీతో పంచుకున్నాం ’’ అని తెలిపారు. బుమ్రా దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలంటూ అభిమానులు సామాజిక మాధ్యమైన ఇన్ స్టాగ్రామ్ లో తెలిపారు. టీం మెట్స్ శిఖర్ ధావన్, చాహెల్ కూడా విషెస్ చేశారు.

సంజన గురించి..

2012లో స్లిట్స్ విల్లా 7 రియాలిటీ షోలో కంటెస్టంట్గా పాల్గొన్నారు. అంతకు ముందు ఆమె ఒక మోడల్, ఒక టీవీ చానల్ వ్యాఖ్యాత.  ఆమె .. ఫెమీనా గ్లోరియస్ను గెలిచారు అలాగే 2012లోనే ఫెమీనా స్టయిల్ దివా ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. 2014లో ప్రముఖ మోడల్ గా అత్యున్నత స్థాయిలో ఉన్నారు. ఫెమీనా మిస్ ఇండియా పూణె పోటీల్లో ఫైనలిస్ట్ గా ఉన్నారు. 2019 వరల్డ్ కప్ మ్యాచ్ పాయింట్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించి పాపులారిటీని సంపాదించారు. కొల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు యజమాని షారూక్ ఖాన్ తన అభిమానుల కోసం నిర్వహించిన ది నైట్ క్లబ్ ప్రోగ్రాంలో వ్యాఖ్యతగానూ పనిచేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button