TECHNOLOGY

ఆదిపురుష్ లో సైఫ్ అలీఖాన్ ఇలా ఉంటాడట.. మీరే చదవండి..

ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్.  ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్ తెలిసింది. ఆదిపురుష్ మూవీలో లంకేష్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నాడని తెలుసు. ఈ పాత్ర కోసం సైఫ్ ను రావణుడిగా.. కొత్తగా చూపించబోతున్నారట. అందుకు సంబంధించిన షూట్ ఇప్పటికే ప్రారంభమైంది. తాజాగా ముంబయిలోని మాద్ ఐస్ల్యాండ్ లో చిత్రీకరణ జరుగుతోంది. అందులో పొడవైన కేశాలంకరణతో నుదుటి మీద పడేలా కొత్త హెయిర్ కట్ తో కనిపించనున్నాడు. ఆదిపురుష్ లో రాముడి పాత్రలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపిస్తున్నాడు. ప్రభాస్ సరసన సీతగా కృతి సనన్ ను ఎంపిక చేయడం తెలిసిందే. లక్ష్మణుడి పాత్ర కోసం సన్నీ సింగ్ ను తీసుకున్నారు. ప్రభాస్ తొలిసారి హిందీ స్ట్రయిట్ సినిమాను చేస్తున్నాడు. అఫ్ కోర్స్ పరిచయం కూడా అవుతున్నాడు.

దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేస్తానని చెప్పారు. అయితే 2020 ఆగస్టు 18 న ఆదిపురుష్ ప్రమోషనల్ పోస్టర్ విడుదల చేసి డైరెక్టర్ రౌత్ అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. 2021 జనవరి 19న ఈ చిత్రానికి సంబంధించిన షూట్ ప్రారంభమైంది. సీత పాత్ర కోసం అనుష్క శెట్టి, అనుష్క శర్మ, కైరా అద్వాని, కీర్తి సురేష్ పేర్లు వినిపించగా, ఆఖరికి కృతి సనన్ సెట్ అయ్యింది. ఆదిపురుష బడ్జెట్ రూ.500. తెలుగు, హిందీ భాష ల్లో రిలీజ్ కానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button