TECHNOLOGY

ఆచార్య సెట్లో.. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ఫొటో వైరల్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య మూవీ చిత్రీకరణకు సంబంధించిన ఫొటో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆర్మీ గెటప్లో చిరు, ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్, పక్కన డైరెక్టర్ శివ, బ్యాక్ గ్రౌండ్లో సెట్ కనిపిస్తున్నది. దీంతో ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నది. ఇద్దరూ ఆర్మీ గెటప్స్ లో కనిపించడం, పైగా ఒకే రకమైన బ్లాక్ కళ్లజోళ్లు పెట్టుకోవడం చూడొచ్చు. బ్యాక్ గ్రౌండ్ చూస్తుంటే సాంగా లేక ఫైటా అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే. అయితే ఈ ఫొటో సామాజిక మాధ్యమంలో రావడంపై చిరు, చరణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.   చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఇప్పటి వరకు మూడు సినిమాల్లో కలిసి నటించారు. మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నెంబర్ 150 చిత్రాల్లో అతిథి పాత్రల్లో ఒకరి చిత్రాల్లో ఒకరు కనిపించారు.  తాజాగా ఆచార్యలోనూ నటిస్తున్నారు. ఇటీవల ఆచార్య టీజర్కు అనూహ్య స్పందన రావడం తెలిసిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button